Friday, 1 May 2015

నేపాల్‌తో ఈ వెటకారాలేంటి?



నేపాల్‌లో సంభవించిన భారీ భూకంపం కారణంగా ఆ దేశం ఎప్పటికి కోలుకుంటుందో ఊహించడానికి కూడా వీల్లేనంతగా నష్టపోయింది. ఇప్పటికే మృతుల సంఖ్య ఆరు వేలను దాటింది. ఈ సంఖ్య పదివేలను దాటే ప్రమాదం వుందని అధికారవర్గాలు చెబుతూ వుంటే, ఆ సంఖ్య పదిహేను వేలను కూడా చేరే ప్రమాదం వుందని పరిశీకులు భావిస్తున్నారు. ఇలాంటి అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ప్రపంచంలో ఎవరైనా స్పందించి నేపాల్‌‌కి అందించాల్సింది ఆహారం, ఆసరా, మేమున్నామనే భరోసా. ఈ విషయంలో అనేక దేశాలు ముందడుగు వేసి నేపాల్‌ని ఆదుకుంటూ వుండటం అభినందనీయమైన విషయం. అయితే పాలకుండలో విషపు బొట్టుల్లాంటి కొన్ని ఘటనలు కూడా జరుగుతూ ఆ ఘటనలకు కారణమైన వాళ్ళు మనుషులేనా అనే అనుమానాలు కూడా కలుగుతూ వున్నాయి. ఈమధ్య వేలంవెర్రిలా మారిన సెల్ఫీల పిచ్చి నేపాల్‌లో కూడా ముదిరినట్టుంది. వేలాది మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంతో తమ ఆస్తులను, ఆప్తులను కోల్పోయి గుండెలు అవిసేలా రోదించే వారు లక్షల మంది వుంటే, భూకంప శిథిలాల దగ్గర నిల్చుని సెల్ఫీలు తీసుకుంటున్న వారిని ఏమనాలి? ఇది ఒక  ఉదాహరణ అయితే, ఇంతకంటే దారుణమైన ఉదాహరణలు మరికొన్ని వున్నాయి.

No comments:

Post a Comment