Monday, 4 May 2015

చ‌ర‌ణ్‌తో ఫైట్ చేయ‌బోతోన్న రకుల్‌

http://www.teluguone.com/tmdb/news/Rakul-fight-with-charan-tl-45863c1.html
రకుల్ ప్రీత్ సింగ్ జోరు ఓ రేంజులో ఉందిప్పుడు. ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌, మ‌హేష్‌, రామ్‌.. వీళ్లంతా `మాకు ర‌కులే కావాలి..` అంటున్నారు. చేతి నిండా సినిమాలే! ఈ క్రేజ్‌ని ఇలానే ప‌ది కాలాల పాటు కాపాడుకొనే ప్ర‌య‌త్నాలు చేస్తోందీ భామ‌. ర‌కుల్‌ ఎలాగూ గ్లామ‌ర్ డాలే. ఆ అందాల్ని మ‌రింత‌గా సాన‌బెడుతోందిప్పుడు. స‌న్న‌గా రివ‌ట‌లా ఉండే ర‌కుల్ ఇప్పుడు జిమ్‌లో దూరి క‌స‌ర‌త్తులు చేస్తోంది. ఎందుకంటూ ఆరా తీస్తే.. ర‌కుల్ త్వ‌ర‌లో ఫైటింగులు చేయ‌బోతోంద‌ని తేలింది. ఔను.. ర‌కుల్ డిష్యూం డిష్యూం అంటూ ఫైటింగులు చేస్తుంద‌ట‌. రామ్ చ‌రణ్ - శ్రీ‌నువైట్ల కాంబినేష‌న్ లో ఓ చిత్రం తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. అందులో ర‌కుల్ క‌థానాయిక‌. ఈ సినిమాలో చ‌ర‌ణ్ ఫైట్ మాస్ట‌ర్‌గా క‌నిపించ‌బోతున్నాడు. ర‌కుల్‌దీ అలాంటి ర‌ఫ్ అండ్ ట‌ఫ్ పాత్రేన‌ట‌. అందుకే జిమ్ లో క‌స‌ర‌త్తులు చేస్తోందిప్పుడు. ఆ ఫొటోలు ఇప్పుడు నెట్ ప్ర‌పంచంలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. అంటే.. ర‌కుల్‌, చర‌ణ్ ఇద్ద‌రూ డిష్యూం డిష్యూం అన్న‌మాట‌.

No comments:

Post a Comment