Monday, 4 May 2015

క‌మ‌ల్ అప్పులు రూ.40 కోట్లు

http://www.teluguone.com/tmdb/news/Kamal-Hassan-Credits-40-Cores-tl-45864c1.html
స్టార్ హీరోల సినిమాల‌కూ వాయిదా బెడ‌ద త‌ప్ప‌డం లేదు. వాళ్ల సినిమాలూ ఎప్పుడొస్తాయో, ఎప్పుడు వాయిదా ప‌డ‌తాయో చెప్ప‌లేని ప‌రిస్థితి. క‌మ‌ల్ హాస‌న్ న‌టించిన ఉత్త‌మ విల‌న్ ఓ రోజు ఆల‌స్యంగా ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. శ‌నివారం ఫ‌స్ట్ షోల‌తో `ఉత్త‌మ విల‌న్` బొమ్మ ప‌డింది. అంత‌కు ముందు నిర్మాత‌ల‌కూ, డిస్టిబ్యూట‌ర్ల‌కు, ఫైనాన్సియ‌ర్ల‌కూ మ‌ధ్య హైడ్రామా న‌డిచింది. ఈ సినిమాపై దాదాపుగా రూ.40 కోట్ల అప్పులున్నాయట‌. అవి తీరిస్తే గానీ... ఈ సినిమాని విడుద‌ల చేయ‌నివ్వం అని ఫైనాన్సియ‌ర్లు భీష్మించుకొని కూర్చున్నార‌ట‌. శ‌నివారం కూడా ఈసినిమా బ‌య‌ట‌కు రాక‌పోతే కోట్ల‌లో న‌ష్టం వ‌స్తుంది. అందుకే క‌మ‌ల్ హాస‌న్ త‌న సొంత పూచీ క‌తుపై ఈ సినిమాని విడుద‌ల చేయించార‌ని తెలుస్తోంది. త‌మిళ నిర్మాత‌ల మండ‌లి కూడా ఈ విష‌యంలో క‌మ‌ల్‌కి బాస‌ట‌గా నిలిచింద‌ట‌. సినిమా ముందుకు బ‌య‌ట‌కు రానివ్వండి.. ఆ త‌రవాత అప్పుల సంగ‌తి చూద్దాం అని నిర్మాత‌ల మండ‌లి కాస్త చేదోడువాదోడుగా నిలిచి క‌మ‌ల్ ప‌క్షాన నిలిచింద‌ట‌. ఈ సినిమా నిర్మాణంలో క‌మ‌ల్ ఓ భాగ‌స్వామి. అందుకే క‌మ‌ల్ పూచీక‌తుతో ఈ సినిమా బ‌య‌ట‌కు వ‌చ్చిందట‌. సినిమా బాగుంది అంటున్నారుగానీ వ‌సూళ్లు అంతంత‌మాత్రంగానే క‌నిపించాయి. సో.. క‌మ‌ల్ రూ.40 కోట్లు ఎలా చెల్లిస్తాడో మ‌రి?

No comments:

Post a Comment