Monday, 6 April 2015

సిద్ధయ్య ఆరోగ్యం మరింత క్షీణించింది

http://www.teluguone.com/news/content/nalgonda-encounter-39-44862.html#.VSJ4INyUfVE

నల్లగొండ జిల్లా మోత్కూరు మండలం జానకీపురం-చిన్నకోడూరు మధ్య సిమి తీవ్రవాదులు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆత్మకూరు (ఎం) ఎస్ ఐ జూలూరి సిద్ధయ్య ఆరోగ్యం మరింత క్షీణించింది. హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రిలోని ఆయన వెంటిలేటర్‌ మీద చికిత్స పొందుతున్నారు. ఆయన అపస్మారక స్థితిలోనే వున్నారు. సిద్ధయ్య శరీరం నుంచి మూడు బుల్లెట్లు తొలగించారు. మెదడులో వున్న ఒక బుల్లెట్‌ని తీయాల్సి వుంది. ఈ బుల్లెట్ తొలగించే విషయంలో డాక్టర్లు ఏ నిర్ణయమూ తీసుకోలేకపోతున్నారు. ఆ బుల్లెట్ తీయడం మరింత ప్రమాదకరం అయ్యే అవకాశం వుందని భయపడుతున్నారు. ఇదే ఆస్పత్రిలో ఎస్ఐ సిద్ధయ్య భార్య ధరణిష ఓ మగబిడ్డకు జన్మించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎస్ఐ సిద్ధయ్యతో పాటు పుట్టిన బిడ్డను కూడా చూసేందుకు అనేకమంది తరలి రావటంతో ఆ బాబుకు ఇన్ఫెక్షన్ సోకినట్టు తెలుస్తోంది.

No comments:

Post a Comment