తమిళనాడులోని దిండిగల్ జిల్లా సిద్దయన్ కోట గ్రామ శివారులోని వత్తలగుండు రోడ్డులో శుక్రవారం తెల్లవారుఝామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మధురై నుంచి కేరళ వెళ్తున్న పాల ట్యాంకర్, ప్రయాణికులతో వెళ్తున్న కారు ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న తొమ్మిది మంది అక్కడికక్కడే మరణించారు. ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తిని మధురై ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. దుర్ఘటన జరిగిన ప్రాంతంలో పాల ట్యాంకర్లోని పాలు, దుర్ఘటనలో మరణించిన వారి రక్తం కలసిపోయి చూస్తున్నవారికి కన్నీళ్ళు తెప్పిస్తున్నాయి.
No comments:
Post a Comment