Friday, 17 April 2015

‘మా’ అధ్యక్షుడిగా రాజేంద్రుడి విజయం



తెలుగు సినిమా నటీనటుల సంఘం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడిగా నటుడు డాక్టర్ రాజేంద్రప్రసాద్ ఎన్నికయ్యారు. ఆయన తన ప్రత్యర్థి నటి జయసుధపై 87 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ‘మా’లో మొత్తం 702 మంది సభ్యులున్నారు. వీరిలో 394 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఫిల్మ్‌ఛాంబర్‌ వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. 

‘మా’ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన మొదట్లో సినీ పరిశ్రమలోని పెద్ద తలకాయలన్నీ అండగా నిలిచిన జయసుధ విజయం సాధించే అవకాశాలున్నాయని భావించారు. అయితే ఆ తర్వాత రాజేంద్రప్రసాద్ ప్యానల్ ప్రచారంలో ముందంజ వేయడం, ఇతర కారణాల వల్ల ఆయన గెలుస్తారన్న అభిప్రాయాలు ఏర్పాడ్డాయి. ఎన్నికలు పూర్తయిన తర్వాత రాజేంద్ర ప్రసాద్ విజయం ఖాయమన్న అభిప్రాయాలు బలపడ్డాయి.

No comments:

Post a Comment