Friday, 3 April 2015

హైకోర్టు విభజనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అభ్యంతరమా?


ఆంద్ర, తెలంగాణా రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టుని విభజించేందుకు తెలంగాణా ప్రభుత్వం, కేంద్రప్రభుత్వం, సుప్రీంకోర్టు సంసిద్దత వ్యక్తం చేసాయి. ఉమ్మడి హైకోర్టులో ప్రస్తుతం 49మంది న్యాయమూర్తులు ఉండగా వారిని ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలకు 60:40 నిష్పత్తిలో పంచేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కళ్యాణ్ జ్యోతి సేన్ గుప్తా వారిలో ఎవరు ఏ రాష్ట్ర హైకోర్టులో పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్నారనే వివరాలు కూడా సేకరించారు.

ప్రస్తుతం ఉన్న హైకోర్టు హైదరాబాద్ లో ఉంది కనుక అది తెలంగాణా రాష్ట్రానికే చెందుతుందనే ఉద్దేశ్యంతో రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే కొత్తగా హైకోర్టు ఏర్పాటు చేయాలని పేర్కొనబడింది. కనుక తెలంగాణా రాష్ట్రానికి హైకోర్టు ఏర్పాటు చేయడం అంటే విభజన చట్టాన్ని ఉల్లంఘించడమేనని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. దానితో ఉమ్మడి హైకోర్టుని విడదీసి తెలంగాణా రాష్ట్రానికి కొత్తగా హైకోర్టు ఏర్పాటు చేద్దామనే తెలంగాణా ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది.

For More At : http://www.teluguone.com/news/content/high-court-45-44776.html#.VR527tyUfVE

No comments:

Post a Comment