Saturday, 18 April 2015

అద్దె ఇంటికి చంద్రబాబు

http://www.teluguone.com/news/content/chandra-babu-rent-house-39-45291.html#.VTIw-tKeDGc

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐదు రోజుల చైనా పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కి తిరిగి వచ్చారు. వచ్చిన వెంటనే ఆయన ఇల్లు మారారు. ప్రస్తుతం ఆయన కుటుంబం జూబిలీహిల్స్‌ రోడ్ నంబర్ 65లో వున్న ఇంటిలో నివాసం వుంటున్నారు. ఈ ఇంటిని పూర్తిగా తొలగించి కొత్త భవనం నిర్మించనున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు కుటుంబం జూబిలీహిల్స్ రోడ్ నంబర్ 24లో వున్న ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నారు. శనివారం నాడు ఆయన కుటుంబ సమేతంగా అద్దె ఇంట్లోకి మారారు.

No comments:

Post a Comment