Saturday, 11 April 2015

టీవీ హీరోయిన్ ఆత్మహత్య


టీవీ సీరియల్స్ లో హీరోయిన్ గా నటించే ఒక నటి ఆత్మహత్య చేసుకొంది. కోల్‌కతాలో ఈ ఘటన జరిగింది. దిషా గంగూలీ.. ఈమె బెంగాలీ లో పాపులర్ సీరియల్స్ లో నటిస్తోంది. చిన్న వయసులోనే నటిగా మంచి పేరు సంపాదించుకొంది. కాగా 23 ఏళ్ల దిషా శుక్రవారం ఉదయం తను ఉంటున్న ఫ్లాట్ లో సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొంది. ఆమె గదికి లోపల గడి పెట్టి ఉండటంతో ఆమె బాయ్ ఫ్రెండ్ తలుపు పగలకొట్టి ఆమె మృతదేహాన్ని కిందకు దించాడు. దిషా చనిపోయిన తరువాత కుటుంబ సభ్యులు ఇప్పటి వరకు ఎవరి మీద ఎలాంటి ఫిర్యాదు ఇవ్వలేదని పోలీసులు తెలిపారు.

No comments:

Post a Comment